పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యాన్ని ఢీకొన్న యోధుడు అల్లూరి

by Disha Web Desk |
పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యాన్ని ఢీకొన్న యోధుడు అల్లూరి
X

దిశ, ఫీచర్స్: భారత స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రలో మహోజ్వల శక్తిగా పేరుగాంచిన అల్లూరి సీతారామరాజు 1897 జూలై 4 జన్మించారు. తూర్పు గోదావరి జిల్లా కోనసీమకు చెందిన రాజోలు తాలూకా కోమటిలంక, బట్టేలంక గ్రామాలలో స్థిరపడ్డ అల్లూరి సాయుధ పోరాటం స్వాతంత్రోద్యమ చరిత్రలో ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం సిద్ధిస్తుందని నమ్మి, 27 ఏళ్లకే ప్రాణాలర్పించిన యోధుడిగా మన్ననలు పొందిన అల్లూరి.. నిరక్షరాస్యులు, నిరుపేదలు, పరిమిత వనరులతోనే బ్రిటీషు సామ్రాజ్యాన్ని ఢీకొన్నాడు. ఈ క్రమంలోనే 1922-1924 మధ్యకాలంలో రంప లేదా మన్యం అటవీ ప్రాంతంలో అల్లూరి నేతృత్వంలో బ్రిటీష్ ప్రభుత్వంపై స్థానిక గిరిజనులు చేసిన తిరుగుబాటును 'మన్య విప్లవం'గా పిలుస్తారు. అయితే అల్లూరి మరణించాక పత్రికలు ఆయనను జాతీయ నాయకుడిగా, శివాజీగా, రాణా ప్రతాప్‌గా, లెనిన్‌గా కీర్తించాయి. రామరాజు వీర స్వర్గమలంకరించాడన్న 'సత్యాగ్రహి' పత్రిక.. అయనను జార్జి వాషింగ్‌టన్‌తో పోల్చింది. సీతారామరాజు జీవితచరిత్ర గురించిన బుర్రకథలు, నాటికలు, సినిమాలు విడుదలవగా.. ఇప్పటికీ అయన సమాధి కృష్ణదేవిపేట (కే.డి పేట)లో ఉంది.


Next Story

Most Viewed