AP News: బీసీలంతా సీఎంకు అండగా ఉండాలి

by Disha Web Desk 12 |
AP News: బీసీలంతా సీఎంకు అండగా ఉండాలి
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర‌ కార్మికశాఖ మంత్రిగా గుమ్మనూరు జయరాం సచివాలయంలో బాధ్యతలు స్వీక‌రించారు. వెలగపూడి ‌చివాల‌యంలో బుధవారం ఉదయం కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదమంత్రోచ్చరణల నడుమ మంత్రిగా బాధ్యతలు చేప‌ట్టారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం మంత్రి గుమ్మనూరు జయరాం కు అధికారులు ఇతర నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత మంత్రి జయరాం మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారని కొనియాడారు. బీసీలంతా సీఎంకు అండగా ఉంటారని చెప్పుకొచ్చారు.

మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ లకు సీఎం అధిక ప్రాధాన్యత‌ ఇచ్చాని గుర్తు చేశారు. కార్మికులకు ఈఎస్ఐ ద్వారా వైద్యం అందించడంతో పాటు ఈ-ఔషధ ద్వారా పాదర్శక విధానం తీసుకొచ్చినట్లు మంత్రి జయరాం తెలిపారు. ఇకపోతే గుమ్మనూరు జయరాం కు మరోసారి సీఎం జగన్ అవకాశం కల్పించారు. 2019 ఎన్నికల్లో గెలుపొంది వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రివర్గంలో సీఎం జగన్.. జయరాంకు చోటు కల్పించారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో సైతం అవకాశం ఇచ్చారు. 11 మంది సీనియర్లకు సీఎం జగన్ మరోసారి అవకాశం ఇచ్చారు. వారిలో గుమ్మనూరు జయరాం ఉన్న సంగతి తెలిసిందే.

Next Story

Most Viewed