ఆలియా తన మొదటి భార్య కాదంటున్న రణ్‌బీర్..

by Disha Web |
ఆలియా తన మొదటి భార్య కాదంటున్న రణ్‌బీర్..
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ యంగ్ హీరో రణ్‌బీర్ కపూర్ఇటీవల ఆలియా భట్‌తో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత ఇద్దరు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. రణ్‌బీర్ వరుస మూవీలను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. వాటికి సంబంధించిన ప్రమోషన్స్‌లో భాగంగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నాడు. అయితే, ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ఆలియా నాకు రెండో భార్య. అది ఎలాగంటే గతంలో ఓ సంఘటన జరిగింది.

నేను హీరోగా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఓ లేడీ ఫ్యాన్ మా ఇంటికొచ్చి మా ఇంటి గేట్‌ను పెళ్లాడింది. నేను ఇంటికి రాగానే మా వాచ్‌మెన్‌ ఆ విషయం చెప్పాడు. నాకూ తనకు పెళ్లయిపోయినట్లేనని సంతోషించి అక్కడినుంచి వెళ్లిపోయిందట. దీంతో ఆమె నా మొదటి భార్య అవుతుందేమో. కానీ, నా మొదటి భార్యను నేను ఇప్పటిదాకా చూడలేదు. ఇలాంటి క్రేజీ పని చేసిన అమ్మాయిని చూడాలి" అంటూ నవ్వుతూ చెప్పాడు. అయితే దీనిపై ఆలియా ఏమంటుందో చూడాలి మరి. ఇటీవల గంగుబాయి, ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్‌తో ఆలియా మాంచి జోష్‌లో ఉంది.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed