భర్తను తాళ్లతో కట్టేసి రివేంజ్ తీసుకున్న నటి.. అందరికీ గుణపాఠం కావాలంటూ

by Disha Web |
భర్తను తాళ్లతో కట్టేసి రివేంజ్ తీసుకున్న నటి.. అందరికీ గుణపాఠం కావాలంటూ
X

దిశ, సినిమా: అలియా భట్, షెఫాలీ షా, విజయ్ వర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'డార్లింగ్స్'. తాజాగా రిలీజైన ట్రైలర్ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఆకట్టుకుంటుండగా.. అలియా భర్త విజయ్ కనిపించకుండా పోయాడని పోలీస్ స్టేషన్‌లో కంప్లయింట్ ఇవ్వడంతో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. అయితే ఇన్ని రోజులు భర్త చేతిలో దారుణంగా హింసించబడిన అలియానే షెఫాలీషా సాయంతో ఎవరికీ అనుమానం రాకుండా ఇంట్లోనే బంధించి హింసిస్తుంది.

భార్య ఎదురుతిరిగితే భర్తల పరిస్థితి ఎలా ఉంటుందో ఉదాహరించిన సినిమా.. ఆగస్టు 5న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కాబోతోంది. కాగా ఈ చిత్రం ద్వారా నిర్మాతగా మారబోతున్న అలియా.. తప్పకుండా సినిమా అందరికీ నచ్చుతుందని, అభిమానుల ఆశీస్సులు కావాలని కోరింది.

Next Story

Most Viewed