మహారాష్ట్రలో ఉదయ్‌పూర్ తరహా ఘటన

by Disha Web |
మహారాష్ట్రలో ఉదయ్‌పూర్ తరహా ఘటన
X

ముంబై: ఉదయ్‌పూర్ తరహాలోనే నుపూర్‌శర్మ వ్యాఖ్యలకు మద్దతు ఇచ్చినందుకు మహారాష్ట్రలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. అమరావతి ప్రాంతానికి చెందిన 54 ఏళ్ల కెమిస్ట్ ఉమేష్ ప్రహ్లద్ రావు నుపూర్ పోస్ట్‌కు మద్దతు ఇచ్చారనే నెపంతో కొందరు దుండగులు నరికి చంపారు. ఉదయ్‌పూర్ ఘటన కంటే ముందే జరిగినప్పటికీ ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 21న ఉమేష్‌ను దారుణంగా నరికి చంపారని పోలీసులు తెలిపారు. దీనిపై విచారణ జరపాలని ఇప్పటికే బీజేపీ నేతలు పోలీసులను కోరారు. ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న ఆరుగురిని అరెస్ట్ చేశామని వెల్లడించారు.

అమరావతిలో మెడికల్ షాపు నడుపుతున్న ఉమేష్ నుపూర్ శర్మ చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ముస్లిం సభ్యులు ఉన్న గ్రూపుల్లోనూ పొరపాటున దీనిని షేర్ చేశారని వెల్లడించారు. గత నెల 21న ఉమేష్ షాపు మూసి, తన కొడుకు, కోడలుతో కలసి ఇంటికి వెళ్తున్న క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు బైకులపై వచ్చి అడ్డుకున్నారు. ఉమేష్‌ను చుట్టుముట్టి పదునైన ఆయుధంతో గొంతు కోశారు. రక్తపు మడుగులో పడి ఉన్న ఉమేష్‌ను తన కొడుకు ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే మరణించారు. సీసీటీవీ విజువల్స్ ఆధారంగా నిందితులను గుర్తించి, ఆయుధాన్ని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తు!

మహారాష్ట్రలో జరిగిన దారుణ హత్యపై కేంద్రమంత్రి అమిత్ షా స్పందించారు. ఈ కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్నీ(ఎన్ఐఏ) దర్యాప్తు చేపట్టాలని కోరినట్లు సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. గత నెలలో జరిగిన ఈ హత్య కేసులో కొందరిని పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ, విచారణలో వారు నోరు విప్పడం లేదు. ముందుగా ఇది వ్యక్తిగత లేదా దోపిడి కోసమో చేశారని భావించినప్పటికీ, అలాంటి ఆధారాలు ఏమి లభించకపోవడం గమనార్హం.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed