2024 తర్వాత చంద్రబాబు రాజకీయ జీవితం క్లోజ్

by Disha Web |
2024 తర్వాత చంద్రబాబు రాజకీయ జీవితం క్లోజ్
X

దిశ, ఏపీ బ్యూరో : తెలుగుదేశం పార్టీపైనా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌లపై మాజీమంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. వైసీపీ ప్లీనరీ సమావేశాల్లో వారినే టార్గెట్ చేస్తూ చెడుగుడు ఆడుకుంటున్నారు. తన సొంత నియోజకవర్గం గుడివాడతోపాటు కృష్ణా, గుంటూరు జిల్లాలలో జరుగుతున్న వైసీపీ ప్లీనరీ సమావేశాలకు హాజరవుతూ టీడీపీపై ఓరేంజ్‌లో విరుచుకుపడుతున్నారు. తాజాగా పల్నాడు జిల్లాలో శనివారం జరిగిన వైసీపీ ప్లీనరీ సమావేశంలో రీజననల్ కో ఆర్డినేటర్ హోదాలో హాజరైన మాజీమంత్రి కొడాలి నాని మరోసారి టీడీపీపైనా, చంద్రబాబుపైనా విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీ బొంబాయిపార్టీ అంటూ ధ్వజమెత్తారు. పార్టీ అధినేత చంద్రబాబు ఓ బొంబాయి అయితే ఆయన నడుపుతున్న పార్టీ బొంబాయి పార్టీ అంటూ ఎద్దేవా చేశారు.

వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రి పీఠం నుంచి దించి చంద్రబాబును అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా దుష్టచతుష్టయం ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. దుష్టచతుష్టయం ప్రయత్నాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాల్సిన బాధ్యత పార్టీ నేతలు, కార్యకర్తలపై ఉందని చెప్పుకొచ్చారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ధనంకోసం రాజకీయాలు చేస్తే మంచి తనంలో తన తండ్రి ఫొటో పక్కన తన ఫొటో పెట్టుకునేలా పరిపాలన అందించాలన్న లక్ష్యంతో వైఎస్‌ జగన్‌ పనిచేస్తున్నారని కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీచేస్తాయని.. ఈ అంశంపై ఇప్పటికే ఒప్పందం జరిగిందని చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు 2024 ఎన్నికలే చివరి ఎన్నికలు అని ఆయన రాజకీయ జీవితం సమాప్తమవుతుందని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు కనీసం ప్రతిపక్ష హోదా దక్కదని ఒక్క ఎంపీ సీటును కూడా గెలుచుకోలేరని మాజీమంత్రి కొడాలి నాని జోస్యం చెప్పారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed