వానాకాలం సీజన్‌కు ముందస్తు ఏర్పాట్లు.. మంత్రుల బృందం రివ్యూ

by Disha Web |
వానాకాలం సీజన్‌కు ముందస్తు ఏర్పాట్లు.. మంత్రుల బృందం రివ్యూ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ధాన్యం సేకరణ, మిల్లుల్లో పేరుకుపోయిన నిల్వలు, కస్టమ్ మిల్లింగ్ ప్రక్రియలో నెలకొన్న ఇబ్బందులు, ఎఫ్‌సీఐ తీసుకోవడంలో ఎదురవుతున్న సమస్యలు.. వీటన్నింటిపై ముగ్గురు మంత్రుల బృందం, అధికారులు సచివాలయంలో శుక్రవారం సమీక్షించి వెంటవెంటనే మిల్లింగ్ ప్రక్రియ పూర్తయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ప్రస్తుతం పౌర సరఫరాల సంస్థ దగ్గర భారీ స్థాయిలో ఉన్న నిల్వలను వీలైనంత తొందరగా మిల్లింగ్ చేసి ఎఫ్‌సీఐకు అప్పగించేందుకు చొరవ తీసుకోవాలని ఆ శాఖ అధికారులను మంత్రుల బృందం ఆదేశించింది. ప్రస్తుతం ఉన్న నిల్వలను తగ్గించుకుంటేనే రానున్న వానాకాలం సీజన్‌కు వచ్చే ధాన్యాన్ని స్టాక్ చేయడానికి అవసరమైన స్టోరేజీ స్పేస్ దొరుకుతుందని వివరించారు.

మిల్లింగ్ ప్రక్రియను వీలైనంత వేగంగా చేయడం ద్వారా మాత్రమే వచ్చే సీజన్‌కు ధాన్య సేకరణలో ఇబ్బందులు లేకుండా చూసుకోగలమని, ఇందుకోసం నిరంతరం ఎఫ్‌సీఐ అధికారులతో సంప్రదింపులు జరుగుతూ ఉండాలని సూచించింది. చిన్నచిన్న కారణాలతో బియ్యాన్ని తీసుకోడానికి ఎఫ్‌సీఐ నిరాకరించినా మెరుగైన సమన్వయం ఉంటే ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోడానికి అవకాశం లభిస్తుందని అధికారులకు మంత్రుల బృందం వివరించింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తడిచిన ధాన్యాన్ని ఏం చేయాలనే అంశం మీదా కూడా చర్చ జరిగింది. కానీ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోకుండా సోమవారం జరిగే సమావేశంలో ఫైనల్ చేయాలని నిర్ణయం తీసుకున్నది. మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, నిరంజన్ రెడ్డితో పాటు ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సివిల్ సప్లైస్ కమిషనర్ అనిల్ కుమార్ తదితరులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed