- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దక్షిణ మధ్య రైల్వే జీఎంను కలిసిన ఆదిలాబాద్ ఎంపీ
by Jakkula.Mamatha |
మౌలిక సదుపాయాల విస్తరణకు సంబంధించిన అంశాలపై ఆదిలాబాద్ ఎంపీ గోదం నగేష్ దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవను మంగళవారం సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

X
దిశ, సికింద్రాబాద్: ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో రైల్వే అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల విస్తరణకు సంబంధించిన అంశాలపై ఆదిలాబాద్ ఎంపీ గోదం నగేష్ దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవను మంగళవారం సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రాంతీయ రైల్వే అభివృద్ధి ప్రణాళికలు, ప్రయాణికుల సౌకర్యాలు మెరుగుదల, రైల్వే మౌలిక వసతుల అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ గోదం నగేష్ తన నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు మెరుగైన రైల్వే సేవలు అందించేందుకు అవసరమైన పలు ప్రతిపాదనలను జనరల్ మేనేజర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రాంతీయ అభివృద్ధికి రైల్వే శాఖ కట్టుబడి ఉందని, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు చేపడతామని జిఎం తెలిపారు.
Next Story






