నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవు : దావ స్వాతి

by Batti.Sumithra |

స్క్రాప్ దుకాణాల నిర్వాహకులు నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ దావ. స్వాతి అన్నారు.

నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవు : దావ స్వాతి
X

దిశ, మంచిర్యాల : స్క్రాప్ దుకాణాల నిర్వాహకులు నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ దావ. స్వాతి అన్నారు. మంగళవారం పట్టణంలోని బెల్లంపల్లి మార్కెట్ ఏరియా కంట సమీప ప్రాంతంలోని జనావాసాల్లో ఏర్పాటు చేసిన స్క్రాప్ దుకాణాన్ని పరిశీలించారు. ఈ దుకాణం వద్ద అపరిశుభ్ర వాతావరణం నెలకొనడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ స్క్రాప్ దుకాణాల నిర్వాహకులు నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్క్రాప్ దుకాణాన్ని ఎత్తివేసేలా చర్యలు చేపట్టాలన్నారు. కాలనీవాసుల నుండి ఫిర్యాదులు వచ్చాయన్నారు. పట్టణ ప్రాంతానికి దూరంగా ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. స్క్రాప్ దుకాణాన్ని తరలించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. పట్టణంలోని 19వ వార్డులో కల్వర్టుకు రూ.5 లక్షల నిధులతో నిర్మించే కల్వర్టు పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తన్నీరు. రమేష్, నాయకులు దావ.రమేష్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Next Story