అయ్యన్నపై కక్ష సాధింపే.. జగన్‌పై అచ్చెన్నాయుడు ఫైర్

by Disha Web |
అయ్యన్నపై కక్ష సాధింపే.. జగన్‌పై అచ్చెన్నాయుడు ఫైర్
X

దిశ, డైనమిక్​ బ్యూరో : నిబంధనలకు విరుద్దంగా టీడీపీ నేత అయ్యన్న పాత్రుడి ఇంటి గోడను కూల్చారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. అమరావతిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్​ కక్ష సాధించాలనే టీడీపీ నేత ఇంటి గోడును కూల్చారని విమర్శించారు. సమాచారం ఇవ్వకుండా గోడను కూల్చివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల కుటుంబంపై అమానుషంగా ప్రవర్తించారని మండిపడ్డారు. రాష్ట్రంలో జగన్ బలహీన వర్గాలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అయ్యన్న ప్రభుత్వ అనుమతులు తీసుకుని, నిబంధనల ప్రకారం ఇంటిని నిర్మించుకున్నారని తెలిపారు. రాజ్యాంగాన్ని జగన్ పక్కన పెట్టి తన అవినీతిని ప్రశ్నించిన వారందరిపై దాడులు చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు

Next Story