భద్రతలో నెం.1 అయినా.. మైహోమ్ సిమెంట్‌లో మరోసారి ప్రమాదం

by Disha Web Desk 13 |
భద్రతలో నెం.1 అయినా.. మైహోమ్ సిమెంట్‌లో మరోసారి ప్రమాదం
X

దిశ, మేళ్లచెరువు: మేళ్లచెరువు మండలం లో స్థానిక మై హోం సిమెంట్ ఫ్యాక్టరీలో మంగళవారం పంప్ హౌజ్ వద్ద ఆయిల్ డబ్బాలను గ్యాస్ కట్టర్ తో కట్ చేస్తుండగా ప్రమాదవశాత్తు ఫైర్ జరగడంతో పుచ్చకాయల రాము అనే కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని కోదాడ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని అడిగితే ఎలాంటి సమాచారం లభించకపోవడం గమనార్హం.


రెండు వారాల క్రితం మై హోమ్ సిమెంట్ మిల్ 2లో రిగ్గర్ సోమేశ్వర్ రెడ్డి రిపేర్ చేస్తుండగా అకస్మాత్తుగా మిషన్ రన్నింగ్ అవడం తో మిల్లు బోల్టుల మధ్య నలిగి తీవ్ర గాయాలైన ఘటన మరువకముందే.. మరో ఘటన జరగడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. ఇంత జరిగినా ఫ్యాక్టరీ యాజమాన్యం కార్మికుల విషయంలో అలసత్వం వహిస్తూ.. తమ తప్పులను దాచి భద్రత వారోత్సవాలు పేరున ఉత్సవాలు జరుపుకుంటుంది.


కార్మికులకు భద్రత కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం మైహోమ్ యాజమాన్యానికి ఉన్నతాధికారులు వత్తాసు పలుకుతూ భద్రతలో నెం.1 అంటూ డప్పులు కొట్టుకోవడానికే పరిమితమై కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడటం ఎంత వరకు సమంజసమో వత్తాసు పలికే ప్రభుత్వ అధికారులే సమాధానం చెప్పాలి.


మెరుగైన సేవలందించడంలో నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తున్న మాట వాస్తవమని ఆ సంస్థలలో పనిచేస్తున్న కార్మికులు వాపోతున్నారు. ఇప్పటికైనా మై హోమ్ ఇండస్ట్రీకి డప్పు కొట్టే అధికారులు మేల్కొని కార్మికుల పక్షాన, కార్మికులకు రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని కార్మిక సంఘాలు కోరుకుంటున్నాయి.


Next Story

Most Viewed