దేశ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారేందుకు ఆప్ ప్రణాళికలు

by Disha Web Desk 17 |
దేశ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారేందుకు ఆప్ ప్రణాళికలు
X

న్యూఢిల్లీ: పంజాబ్‌లో పాగా వేసిన ఆమ్ ఆద్మీ పార్టీ దేశ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. దీనిలో భాగంగా ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రచారానికి ప్రణాళికలు రచిస్తోంది. ఈ వారంలో అందుకు తగ్గట్టుగా పెద్ద ఎత్తున ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆప్ జాతీయ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ , పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఏప్రిల్ 2న అహ్మదాబాద్‌లో రోడ్ షో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా తర్వాతి రోజు గుజరాత్‌లోని పార్టీ కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఆ తర్వాత ఏప్రిల్ 6న హిమాచల్ ప్రదేశ్‌లో తీరంగ యాత్రలో భగవంత్ మాన్‌తో పాటు కేజ్రివాల్ పాల్గొననున్నారు. ఇప్పటికే పంజాబ్‌లో ఊహించని మెజారిటీతో గెలిచిన ఆప్, మిగతా రాష్ట్రాల్లోనూ తన ముద్రను వేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. కాగా, తాజా ఎన్నికల్లో గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో పోటీ చేసినప్పటికీ భంగపాటుకు గురైంది.



Next Story

Most Viewed