ఆధిపత్య పోరు: మాజీ మంత్రి, ఎమ్మెల్యే మధ్య తారాస్థాయికి చేరిన మాటల యుద్ధం

by Disha Web Desk 13 |
ఆధిపత్య పోరు: మాజీ మంత్రి, ఎమ్మెల్యే మధ్య తారాస్థాయికి చేరిన మాటల యుద్ధం
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ అధికార పార్టీ ఎమ్మెల్యే.. మాజీ మంత్రి మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు మరింత రసవత్తరంగా మారుతోంది. అధికార పార్టీలో ఆధిపత్యం కోసం ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మధ్య ఆరంభమైన ఆధిపత్య పోరు అధికార పార్టీ నాయకులు కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పర దాడులకు పాల్పడ్డారు. పోలీస్ స్టేషన్‌లో పలువురు పై కేసులు నమోదయ్యాయి. ఈ విషయంలో జూపల్లి రాష్ట్ర ప్రభుత్వానికి, ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసిన ప్రయోజనం లేకపోయింది.

ఈ క్రమంలో ఎమ్మెల్యే, మాజీ మంత్రి మధ్య మాటల యుద్ధాలు సాగుతూ వచ్చాయి. మరోవైపు విడివిడిగా కార్యక్రమాలను నిర్వహించారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సాగునీటి వనరుల కల్పన, రైతులకు నష్ట పరిహారాలు తదితర అంశాలలో పొరపాట్లు జరుగుతున్నాయని ఎమ్మెల్యే పై తీవ్రస్థాయిలో మీడియా సమక్షంలో విమర్శలు చేశారు. ఈనెల 26వ తేదీన కొల్లాపూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్దకు రా.. మీ అవినీతి.. అక్రమాల చిట్టా పై చర్చిద్దాం అని జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు.

ఈ క్రమంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి కొల్లాపూర్‌లో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు, బహిరంగ సభ అనంతరం నేరుగా మాజీ మంత్రి జూపల్లి ఇంటికి వెళ్లారు. మంత్రి కేటీఆర్ జూపల్లితో రహస్యంగా మాట్లాడారు.. ఏం మాట్లాడారు అన్నది బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. కానీ మీడియాతో పాటు, నాయకులు కార్యకర్తలు ఇరువురు నేతల మధ్య సఖ్యత కుదిరితే ప్రయత్నం కేటీఆర్ చేశారని భావించారు. మంత్రి కేటీఆర్ పర్యటన ముగిసిన రోజు నుండే సామాజిక మాధ్యమాలలో ఇరువురి నేతల మద్దతుదారులు ఒకరిపై మరొకరు విమర్శలు చేస్తూ కొల్లాపూర్ అధికార పార్టీలో ఇరువురు నేతల మధ్య సఖ్యత కుదిరితే పరిస్థితులు లేవు అన్న సంకేతాలను బహిర్గతం చేశారు.

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అది స్థానం తప్పనిసరిగా ఇరువురి మధ్య సఖ్యత కుదిర్చి పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటారని ఆశించారు. కానీ సోమవారం ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి జూపల్లి కృష్ణారావు చేసిన సవాలును స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. మాజీ మంత్రి సూచనల ప్రకారం.. అంబేద్కర్ చౌరస్తాలో కాకుండా మీ చిచ్చా ఇంటికి వస్తాను.. అక్కడే మీ 20 ఏళ్ల కాలంలో జరిగిన అవినీతి, అక్రమాలను గురించి చర్చిద్దాం అని ప్రతి సవాల్ విసరడం తో కొల్లాపూర్ రాజకీయాలు మరింత వేడెక్కాయి.. ఈ నెల 26న ఏం జరుగుతుందోనని నియోజకవర్గ ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.


Next Story