పెళ్లి గౌను ఫేస్‌బుక్‌లో వేలం.. దాని వెనుక అవాక్క‌య్యే కార‌ణం!

by Disha Web |
పెళ్లి గౌను ఫేస్‌బుక్‌లో వేలం.. దాని వెనుక అవాక్క‌య్యే కార‌ణం!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః పెళ్లి రోజు వ్యక్తి జీవితంలో అత్యంత ప్రత్యేకమైన, మ‌ర‌పురాని రోజుల్లో ఒకటి. జీవితంలో అత్యంత అందంగా క‌నిపించాల‌ని సంపూర్ణంగా కోరుకునేది ఆ ఒక్క రోజే అంటే ఆశ్చ‌ర్యం కాదు. దాని కోసం ఎంతో ఖ‌ర్చు చేస్తుంటారు. త‌ల నుండి పాదాల వ‌ర‌కూ పెళ్లి ధ‌రించే ప్ర‌తి దానిపై తాహ‌త‌కు త‌గ్గ‌ట్టు ఉత్త‌మ‌మైన‌దే సెలెక్ట్ చేసుకుంటారు. అయితే, వివాహ‌ వేడుక ముగిసిన తర్వాత, పెళ్లి బ‌ట్టలు దాదాపుగా మూల‌న ప‌డ‌తాయి. బీరువాలో భ‌ద్రంగా దాచేసి, ఎప్పుడ‌న్నా ఓసారి చూసి పెట్టేస్తుంటాము. కానీ, ఆ దుస్తుల్లో ఆరోజుకు చెందిన మ‌న ఆనందం దాగుంటుంది. అలాంటి ఆనందాన్నే అదే డ్ర‌స్‌తో పొందాల‌నుకుంది ఓ మ‌హిళ‌. అమెరికాకు చెందిన గ్వెన్‌డోలిన్ స్ట‌ల్గిస్ తన వివాహ గౌనును అతి త‌క్కువ ధ‌ర‌కు ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఆమె నిస్వార్థ చర్య అనేక మంది ఇతర మహిళలకు ప్రేర‌ణ‌గా మారి, ఒక రకమైన ఉద్యమానికి దారితీసింది.

గ్వెన్‌డోలిన్ స్టల్గిస్ మే 20న తన ఫేస్‌బుక్ ఖాతాలో తన పెళ్లి గౌనును దాదాపు 3,000 డాల‌ర్ల పెట్టి కొన్నాన‌ని, దాన్ని ఇంకెవ‌రికైనా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు పోస్ట్ పెట్టింది. అయితే, ఇలాంటి గౌను ధ‌రించాల‌నుకునే వారికి, ఎక్కువ ధ‌ర పెట్టి కొన‌లేని వారికి, తాము అనుకున్న ధరలో ఇలాంటి గౌను కావ‌లంటే ఈ గౌను విరాళంగా ఇస్తానని పోస్ట్ చేసింది. తన వివాహం స‌మ‌యంలో ఈ గౌనులో తాను చాలా అందంగా ఉందని, తాను ఎలా భావించిందో మరొకరు కూడా అలాగే కోరుకుంటార‌ని, ఈ డ్ర‌స్‌తో ఆ ఆనందం వేరొక‌రిలో కూడా రావ‌డం కోసం ఇది ఇస్తున్న‌ట్లు ఆమె ఫేస్‌బుక్ పోస్ట్‌లో రాసింది. ఇక‌, ఈ డ్ర‌స్ తీసుకున్న త‌ర్వాత‌, రాబోయే మూడు నెలల్లో ఏవ‌రైనా మ‌రో మ‌హిళ‌కి ఇది కావాలంటే, ఆ వ్యక్తి దానిని డ్రై క్లీన్ చేసి మరొక మహిళకు పంపవచ్చని, ఈ గౌన్ ఉన్నంత వరకు దీన్ని ఇలాగే కొనసాగించాల‌ని ఆమె పిలుపునిచ్చారు. ఇప్పుడు స్టల్గిస్ చ‌ర్య సోష‌ల్ మీడియాలో సంచ‌ల‌న‌మే కాదు, దాదాపు ఓ ఉద్య‌మంగా మారడం విశేషం.

Next Story