బీజేపీ నాయకుల అరెస్ట్‌లో ట్విస్ట్... పోలీసులకు షాకిచ్చిన మెజిస్ట్రేట్

by Disha Web Desk |
బీజేపీ నాయకుల అరెస్ట్‌లో ట్విస్ట్... పోలీసులకు షాకిచ్చిన మెజిస్ట్రేట్
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదయిన కేసులో బీజేపీ నాయకులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చిన తరువాత ట్విస్ట్ చోటు చేసుకుంది. పలు సెక్షన్లతో పాటు హత్యాయత్నం కేసులో 23 మంది బీజేపీ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు శనివారం రాత్రి సిరిసిల్ల కోర్టులో హాజరు పర్చారు. అయితే సీఆర్పీసీ 50 ప్రకారం వారిని అరెస్ట్ చేసిన సమాచారం వారి కుటుంబ సభ్యులకు ఇవ్వకపోవడం, నిందితులకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వకపోవడం వంటి తప్పిదాలను మెజిస్ట్రేట్ ఎత్తి చూపుతూ రిమాండ్ రిపోర్ట్ ను కొట్టివేశారు. దీంతో పోలీసులు 23 మందిని కోర్టు ఆవరణలోనే వదిలిపెట్టాల్సి వచ్చింది.

నిందితులు లోపల్నే...

సిరిసిల్ల మెజిస్ట్రేట్ రిమాండ్ రిపోర్ట్ ను కొట్టివేసిన నేపథ్యంలో బీజేపీ నాయకులంతా కోర్టు ఆవరణలోనే ఉండిపోయారు. అయితే వారు కోర్టు దాటి బయటకు రాగానే మళ్లీ అరెస్ట్ చేయాలని పోలీసులు బావిస్తున్నారు. ఈ మేరకు కోర్టు కంపౌండ్ వాల్ దాటగానే మళ్లీ అరెస్ట్ చేయాలని పోలీసులు పథకం వేసుకున్నప్పటికీ బీజేపీ నాయకులు మాత్రం కోర్టు ఆవరణలోనే ఉండిపోయారు. తాము కోర్టు ఆవరణలో ఉన్నప్పుడు పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం లేదని బీజేపీకి చెందిన న్యాయవాదులు సూచించినట్టు సమాచారం. దీంతో వారంతా కూడా కోర్టు ఆవరణలోనే ఉండేందుకు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. పోలీసులు వారిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నా వారి ఎత్తుకు బీజేపీ నాయకులు పై ఎత్తు వేశారు.

Next Story