- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళా సాధికారత దిశగా ముందడుగు : కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
మహిళా అభ్యున్నతి, ఆర్థిక సాధికారత ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళా శక్తి పథకం సరికొత్త మైలురాయిని అందుకుంది.

దిశ, సూర్యాపేట : మహిళా అభ్యున్నతి, ఆర్థిక సాధికారత ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళా శక్తి పథకం సరికొత్త మైలురాయిని అందుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్టీసీ బస్సులను పంపిణీ చేసే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 553 బస్సులను కేటాయించగా, సూర్యాపేట జిల్లాకు 23 బస్సులను ప్రభుత్వం పంపిణీ చేసింది. స్వయం సహాయక సంఘాల మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ బస్సుల నిర్వహణ బాధ్యతలను మహిళా సమాఖ్యలకు అప్పగిస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ. 828 లక్షలను మంజూరు చేసింది. ప్రతి మండల సమాఖ్యకు రూ. 36 లక్షల చొప్పున నిధులను కేటాయించారు. ఈ బస్సుల నిర్వహణ ద్వారా ప్రతి మండల సమాఖ్యకు నెలకు రూ. 69,468 ఆదాయం సమకూరనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళా సంఘాలకు నేరుగా రవాణా రంగంలో భాగస్వామ్యం కల్పించడం పై జిల్లా మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ బస్సుల ఈ పథకం మహిళలను ఆర్థికంగా మరింత బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.






