ఏడాదిగా రాధమ్మ పోరాటం.. అయినా అధికారులు స్పందించరేం...?

by Disha Web Desk 12 |
ఏడాదిగా రాధమ్మ పోరాటం.. అయినా అధికారులు స్పందించరేం...?
X

దిశ,మర్రిగూడ: ఓ నిరుపేద మహిళ న్యాయం కోసం సంవత్సరం పైగా ఒంటరి పోరాటం చేస్తుంది. తమకు న్యాయం కోసం తహశీల్దార్ కార్యాలయం ముందు టెంట్ వేసుకుని నిరసన దీక్షకు కూర్చుంది. దీంతో ఆమెకు మద్దతుగా ఉభయ పక్షాల కమ్యూనిస్టులు సంఘీభావం పలికారు. వివరాల్లోకి వెళ్లితే.. మర్రిగూడ మండలంలోని శివన్న గూడెం గ్రామపంచాయతీలో గోల్కొండ రాధమ్మ 1984 సంవత్సరంలో సర్వేనెంబర్ 980లో 20 గుంటల భూమిని సాదా బైనామ కింద కొనుగోలు చేసింది. అయితే భూ యజమాని చిట్యాల స్తంభారెడ్డి విశ్రాంత పట్వారి అదే గ్రామానికి చెందిన రామచంద్రం ఆ భూమిని విక్రయించాడు. అనంతరం ఆ భూమిని రామచంద్రం నుండి గోల్కొండ రాధమ్మ కొనుగోలు చేసింది. తర్వాత రెవెన్యూ రికార్డులో అధికారులు స్తంభారెడ్డి పేరు తొలగించలేదు. ధరణిలో యధావిధిగా స్తంభారెడ్డి పేరు రావడం జరిగింది.


అతనికి పాస్ పుస్తకాలు మంజూరు కావడంతో రాజేష్, నాగరాజు, గోపాల్, కిరణ్ లకు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశాడు. అయితే ఇప్పుడు భూమి రాధమ్మ ఆధీనంలో ఉండగా కేవలం పాస్ బుక్ మీద మాత్రమే మిగతా వారి పేర్లు వస్తున్నాయి. దీంతో స్తంభారెడ్డి కుమారులు శేఖర్ రెడ్డి, వెంకట్ రెడ్డిలు రాధమ్మను భూమిని ఖాళీ చేయాలని బెదిరింపులకు పాల్పడడుతున్నారు. ఊరంతా ఆ భూమి రాధమ్మదే అని పంచ నామాలో తేలినప్పటికీ గ్రామపంచాయతీలో ఆమె పేరు నమోదు కాకుండా సదరు భూ యజమాని అడ్డుకుంటున్నారని రాధమ్మ అన్నారు. న్యాయం చేయాలని తాసిల్దార్, ఆర్డీవో ,జేసీ, కలెక్టర్లకు తమ గూడు విన్నవించుకున్న ఎలాంటి న్యాయం జరగటం లేదని, న్యాయం జరిగేంత వరకు దీక్ష కొనసాగిస్తానని రాధమ్మ తెలిపారు. ఇప్పటికైనా అధికారులు తమకు న్యాయం చేయకపోతే ఈ టెంట్ కిందనే తాను ఆత్మహత్య చేసుకుంటానని రాధమ్మ కన్నీరుమున్నీరవుతున్నారు. రాధమ్మ దీక్షలో అమరవీరుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోరే సాయిరాం సీపీఐ మండల కార్యదర్శి ఈదుల బిక్షం రెడ్డి సీపీఎం మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య తోపాటు పలువురు పాల్గొన్నారు.


Next Story

Most Viewed