సొంతంగా నానో-ఉపగ్రహాన్ని నిర్మించుకుంటున్న స్కూల్

by Disha Web Desk 12 |
సొంతంగా నానో-ఉపగ్రహాన్ని నిర్మించుకుంటున్న స్కూల్
X

దిశ, వెబ్‌డెస్క్: విద్యార్థులకు అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం పెంపోందించడానికి, వారికి సాంకేతికతపై అవగాహన కల్పించేందుకు ఓ పాఠశాల నానో-ఉపగ్రహాన్ని నిర్మించనుంది. దీనిని కోల్‌కతాకు చెందిన ప్రైవేట్ పాఠశాల అయిన సౌత్ పాయింట్ హైస్కూల్ నానో-ఉపగ్రహాన్ని తయారు చేయనుంది. ఎంపీ బిర్లా గ్రూప్‌లో భాగమైన సౌత్ పాయింట్ హైస్కూల్, బిజినెస్ గ్రూప్ మాజీ చైర్‌పర్సన్ ప్రియంవదా బిర్లా జ్ఞాపకార్థం ఈ ఉపగ్రహానికి 'ప్రియమ్వదాశాట్' అని పేరు పెట్టారు. అలాగే దీని రూపకల్పన, అభివృద్ధి, పరీక్ష, ఏకీకరణ, ప్రయోగానికి ఇండియన్ టెక్నాలజీ కాంగ్రెస్ అసోసియేషన్‌తో ఒక ఒప్పందంపై సంతకం చేసింది. శ్రీహరికోట నుంచి భూ కక్ష్యలోకి ఉపగ్రహాన్ని ఇస్రో పంపనుంది.


Next Story

Most Viewed