చిన్నారి ప్రాణం తీసిన ఐదు రూపాయల కాయిన్

by Disha Web |
చిన్నారి ప్రాణం తీసిన ఐదు రూపాయల కాయిన్
X

దిశ, భువనగిరి రూరల్ : యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. సరదాగా ఆడుకుంటూ కాయిన్​ మింగి చిన్నారి తవును చలించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. భూదాన్ పోచంపల్లి పట్టణంలోని వెంకటరమణ కాలనీకి చెందిన బొంగు మహేశ్, సరిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె చైత్ర(4) వారం రోజుల క్రితం ఇంటివద్ద ఆడుకొంటూ ఐదు రూపాయల కాయిన్ మింగేసింది. అయితే ఆ కాయిన్ గొంతులో ఇరుక్కుపోవడంతో తల్లిదండ్రులు హుటాహుటిన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు చికిత్స చేసి చిన్నారి గొంతులోని కాయిన్ తీయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ చిన్నారి సోమవారం అస్వస్థతకు గురై శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడింది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు చైత్రను అదే ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది. కాయిన్ ఇరుక్కోవడం వల్ల గొంతులో ఇన్ఫెక్షన్ సోకి చిన్నారి మరణించి ఉండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. చిన్నారి చైత్ర ముద్దుముద్దు మాటలతో అల్లరి చేస్తూ ఆడుకుంటూనే అర్ధాంతరంగా తనువు చాలించడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed