అమబెడా అటవీ ప్రాంతంలో తుపాకుల మోత..

by Disha Web |
అమబెడా అటవీ ప్రాంతంలో తుపాకుల మోత..
X

దిశ, భద్రాచలం: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లా అమబెడా అటవీప్రాంతంలో తుపాకుల మోత మోగింది. కుయెమారి ఏరియా కమిటీకి చెందిన మావోయిస్టులు సమావేశం అవుతున్నట్లుగా నిఘా వర్గాలు అందించిన సమాచారం మేరకు పోలీస్ ఉన్నతాధికారులు కాంకేర్ నుంచి డీఆర్‌జీ బృందాన్ని సెర్చ్ ఆపరేషన్‌ల కోసం పంపారు. గాలింపు చర్యలు చేపట్టిన భద్రతా బలగాలకు మావోయిస్టులు తారసపడి కాల్పులు జరపడంతో డీఆర్‌జీ బలగాలు ఎదురుకాల్పులు జరిపారు. హోరాహోరీగా జరిగిన కాల్పుల అనంతరం మావోయిస్టులు దట్టమైన అడవిలోకి తప్పించుకొని పోయినట్లు పోలీసులు తెలిపారు. మావోయిస్టుల క్యాంపు వద్ద రోజువారీ ఉపయోగించే వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Next Story

Most Viewed