ముంబై ఇండియన్స్‌కు భారీ ఊరట: కోలుకున్న హార్దిక్ పాండ్యా

by Malleboina Mahesh |

కోలుకున్న హార్దిక్ పాండ్యా! రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌కు కెప్టెన్ సిద్ధం. ముంబై ఇండియన్స్ అభిమానుల్లో కొత్త జోష్.

ముంబై ఇండియన్స్‌కు భారీ ఊరట: కోలుకున్న హార్దిక్ పాండ్యా
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్‌లో వరుస ఒడుదొడుకులను ఎదుర్కొంటున్న ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్టుకు శుభవార్త అందింది. అనారోగ్యం కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ (DC) తో జరిగిన గత మ్యాచ్‌కు దూరమైన కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Captain Hardik Pandya) ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నట్లు సమాచారం. మంగళవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరగనున్న కీలక పోరులో ఆయన బరిలోకి దిగడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుత సీజన్‌లో ముంబై ప్రదర్శన మిశ్రమంగా ఉంది. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) పై అద్భుత విజయాన్ని అందుకున్న జోరును ముంబై కొనసాగించలేకపోయింది.

నిన్న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ గైర్హాజరీ జట్టుపై స్పష్టంగా కనిపించింది. ఆ మ్యాచ్‌లో ముంబై ఓటమిని చవిచూసింది. ఇప్పుడు జట్టు పగ్గాలను హార్దిక్ తిరిగి చేపట్టనుండటంతో, రాజస్థాన్‌పై విజయం సాధించి మళ్లీ ఫామ్‌లోకి రావాలని ముంబై భావిస్తోంది. హార్దిక్ రాకతో అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో జట్టు సమతూకం పెరుగుతుందని మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది. ముఖ్యంగా పాయింట్ల పట్టికలో అగ్రస్థానాల్లో ఉన్న రాజస్థాన్ రాయల్స్‌ను ఎదుర్కోవాలంటే హార్దిక్ వంటి ఆల్‌రౌండర్ సేవలు ముంబైకి అత్యవసరం.

Next Story