76 మిలియన్ ఏళ్ల‌ నాటి డైనోసార్ అస్థిపంజ‌రం వేలం.. ధర ఎంతో తెలుసా?!

by Disha Web Desk 20 |
76 మిలియన్ ఏళ్ల‌ నాటి డైనోసార్ అస్థిపంజ‌రం వేలం.. ధర ఎంతో తెలుసా?!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః సుమారు 76 మిలియన్ సంవత్సరాల క్రితం భూమిపై సంచరించిన టైర‌న్నోసార‌స్‌ రెక్స్ జాతికి చెందిన డైనోసార్‌ శిలాజ అస్థిపంజరాన్ని ఈ నెలలో న్యూయార్క్‌లో వేలం వేస్తున్న‌ట్లు Sotheby's మంగళవారం ప్రకటించింది. ఈ గోర్గోసారస్ అస్థిపంజరం జూలై 28న సోథెబీ నేచుర‌ల్ హిస్ట‌రీ వేలాన్ని హైలైట్ చేస్తుందని వేలం హౌస్ తెలిపింది. గోర్గోసారస్ అనేవి క్రెటేషియస్ కాలం చివరిలో అంటే ఇప్పుడు పశ్చిమ యునైటెడ్ స్టేట్స్, కెనడా ప్రాంతంలో నివసించిన ఒక అగ్ర మాంసాహార జంతువుగా ప‌రిగ‌ణిస్తారు. ఇది దాని బంధువు టైరన్నోసారస్ రెక్స్ కంటే 10 మిలియన్ సంవత్సరాల కంటే ముందే ఉనికిలో ఉంది.

ఇక‌, మోంటానాలోని హవ్రే సమీపంలోని జుడిత్ రివర్ ఫార్మేషన్‌లో విక్రయిస్తున్న‌ నమూనా 2018లో కనుగొనబడిందని సోథెబీస్ తెలిపింది. ఇది దాదాపు 10 అడుగుల (3 మీటర్లు) పొడవు, 22 (6.7 మీటర్లు) అడుగుల ఎత్తు ఉంది. ఇతర గోర్గోసారస్ అస్థిపంజరాలు అన్నీ మ్యూజియం సేకరణల్లో ఉండ‌గా, ఇది మాత్రం ప్రైవేట్ యాజమాన్యానికి అందుబాటులో ఉన్న ఏకైక నమూనాగా వేలం హౌస్ తెలిపింది. ఈ అస్థిపంజ‌రానికి సంబంధించి సోథెబీ సైన్స్ అండ్ పాపులర్ కల్చర్ గ్లోబల్ హెడ్ సోథెబీ ప్రీసేల్ అంచనా 5 మిలియన్ అమెరికా డాల‌ర్ల (రూ. 39 కోట్లు) నుండి USD 8 మిలియన్ (రూ. 63 కోట్లు) వ‌ర‌కూ ఉంటుందని ప్ర‌క‌టించారు.


Next Story

Most Viewed