వివాహ వేడుకలో దారుణం.. 74 మంది..

by Disha Web Desk 14 |
వివాహ వేడుకలో దారుణం.. 74 మంది..
X

దిశ, వెబ్‌డెస్క్: వివాహ వేడుకలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లికి వచ్చిన బంధువుల్లో 74 మంది ఆసుపత్రి పాలయ్యారు. అందరికీ ఫుడ్ పాయిజనింగ్ జరిగినట్లు వైద్య అధికారులు తెలిపారు. ఈ ఘటన రాజస్థాన్ జలోర్ జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. వివాహానికి వచ్చిన బంధువులు భోజనాలు చేశారు. భోజనం చేసిన కొద్ది సేపటికే దాదాపు 74 మంది వాంతులతో బాధపడ్డారు. అనంతరం ఆసుపత్రికి తరలించడంతో వారికి ఫుడ్ పాయిజనింగ్ అయినట్లు వైద్యులు తెలిపారు. అయితే ఈ ఘటనలో ఆసుపత్రి పాలైన వారంతా 10-20 మధ్య వయసు వారేనని జిల్లా చీఫ్ వైద్యాధికారి గజేంద్ర సింగ్ దేవల్ తెలిపారు. వారందరినీ వైద్యం అందించిన వెంటనే డిశ్చార్జ్ చేసినట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం పెళ్లిలే చేసిన వంటకాలను పరీక్షిస్తున్నామని, ఫుడ్ పాయిజనింగ్‌కు ఏది కారణమో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Next Story