ప్రభుత్వాసుపత్రుల్లో 45 % సిజేరియన్లు.. తల్లిపాలు టీకాతో సమానం

by Dishafeatures2 |
ప్రభుత్వాసుపత్రుల్లో 45 % సిజేరియన్లు.. తల్లిపాలు టీకాతో సమానం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో45 శాతం సిజేరియన్లు జరుగుతున్నాయని మంత్రి హరీష్​రావు పేర్కొన్నారు. ప్రైవేట్​లో ఏకంగా 80 శాతం జరుగుతున్నాయని, వీటిని కట్టడి చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఆఫీసర్లు కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలన్నారు. హైదరాబాద్​పేట్ల బురుజు ఆసుపత్రిలో ఆయన శుక్రవారం మధర్​ మిల్క్​ బ్యాంక్​ ను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ. గతంలో ప్రభుత్వాసుపత్రుల్లో 75 శాతం సి సెక్షన్ జరేగవని, దాన్ని ఇప్పుడు 45 శాతానికి తగ్గించగలిగామన్నారు. హెల్త్ సర్వీసెస్ లో తెలంగాణ రాష్ట్రం దేశంలో 3వ స్థానంలో ఉన్నదన్నారు.

కేరళ, తమిళనాడు తర్వాత తెలంగాణ నిలిచిందని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిందన్నారు. మదర్ మోర్టాలిటీ రేట్ లో తమిళనాడును అధిగమించగలిగామన్నారు. గతంలో సి సెక్షన్ చేస్తే 11 వేల రూపాయలు ఇచ్చేవాళ్లమని, ఆ నెగిటెవ్ ఇంక్రిమెంట్. తొలగించి. ప్రతీ నార్మల్ డెలివరీకి 3 వేల రూపాయలు ఇంక్రిమెంట్‌ను ఇస్తున్నామన్నారు. డాక్టర్లు, నర్సులు, ఆశాలు, ఎ.ఎన్.ఎంలకు ఈ ప్రోత్సాహకం అంది స్తామన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో నార్మల్​డెలివరీలు మరింత పెరగాలన్నారు. ఇక ఇప్పటికీ ప్రైవేట్​ లో 80 శాతం సిజేరియన్లు జరుగుతున్నాయని, వీటిని కట్టడి చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు.

ఆఫీసర్లు కూడా పూర్తి స్థాయిలో ఫోకస్​పెట్టాలన్నారు. పుట్టిన పిల్లలకు తల్లి పాలే ముద్దు అని, వీలైనంత వరకు డబ్బా పాలను తగ్గించాలన్నారు. తొలి గంటలోని తల్లిపాలు టీకాతోసమానం అని పేర్కొన్నారు.. మరోవైపు నార్మల్ డెలివరీ పట్ల అవగాహన పెంచుకోవాలన్నారు. డాక్టర్లే ఆపరేషన్ చేయాలా వద్దా అన్నది నిర్ణయిస్తారన్నారు. ప్రతీ కేసును పూర్తి స్థాయిలో పరిశీలించి వైద్యం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యామిలీ వెల్ఫేర్​ కమిషనర్​ శ్వేతా మహంతీ, డీఎంఈ డా రమేష్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed