అందుబాటులోకి 42.5 మెగావాట్ల సోలార్​విద్యుత్

by Disha Web Desk |
అందుబాటులోకి 42.5 మెగావాట్ల సోలార్​విద్యుత్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రామగుండంలోని 100 మెగావాట్ల నీటిపై తేలియాడే సోలార్​విద్యుత్​కేంద్రం నుంచి ఉత్పత్తి అవుతున్న సోలార్​విద్యుత్​42.5 మెగావాట్లను వాణిజ్యపరమైన అవసరాలకే వినియోగిస్తున్నట్లు రీజినల్​డైరెక్టర్​నరేశ్​ఆనంద్​శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. థర్డ్​ఫేజ్​లో భాగంగా 42.5 మెగావాట్లు ఉత్పత్తి చేసినట్లుగా వెల్లడించారు. కాగా ఫస్ట్​ఫేజ్​లో 17.5 మెగావాట్లు, సెకండ్​ఫేజ్​లో 20 మెగావాట్ల విద్యుత్​ఉత్పత్తి చేసినట్లు తెలిపారు. 100 మెగావాట్ల లక్ష్యంలో ఇప్పటి వరకు మొత్తంగా 80 మెగావాట్ల కరెంట్​ను తేలియాడే సోలార్​విద్యుత్​కేంద్రం నుంచి ఉత్పత్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ లక్ష్యాన్ని చేరుకోవడంపై రామగుండం అధికారులను అభినందించారు. ఇదిలా ఉండగా 100 మెగావాట్ల ఫ్లోటింగ్​సోలార్​ప్రాజెక్ట్​దాదాపు 450 ఎకరాల మేర నీటిపై వ్యాపించి ఉందన్నారు. దీనికోసం రూ.423 కోట్లు వెచ్చించినట్లు ఆయన వెల్లడించారు. సోలార్ ప్లేట్లను 40 బ్లాకులుగా విభజించి ఒక్కో బ్లాక్​నుంచి 2.5 మెగావాట్ల సోలార్​విద్యుత్​ను ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు.

Next Story

Most Viewed