సాధారణ ప్రసవాలకు' ఇన్సెంటివ్'​లు.. ఒక్కో డెలివరీకి రూ.3 వేలు

by Disha Web |
సాధారణ ప్రసవాలకు ఇన్సెంటివ్​లు.. ఒక్కో డెలివరీకి రూ.3 వేలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: నార్మల్​ డెలివరీలు నిర్వహించినందుకు వెంటనే ఇన్సెంటివ్​లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో డెలివరీకి రూ. 3 వేల చొప్పున ఇవ్వాలని శుక్రవారం హెల్త్​ సెక్రటరీ రిజ్వీ జీవో జారీ చేశారు. ప్రభుత్వం ఇచ్చే పారితోషికాన్ని డాక్టర్​ నుంచి శానిటేషన్​ స్టాఫ్​వరకు పంపిణీ చేయనున్నారు. గైనకాలజిస్ట్ /మెడికల్​ ఆఫీసర్​కు రూ. వెయ్యి, మిడ్​వైఫ్​/స్టాఫ్​నర్సు/ఏఎన్​ఎంల కు రూ వెయ్యి, ఆయా/శానిటేషన్​ వర్కర్లకు రూ. 500, సబ్​సెంటర్​ ఏఎన్​ఎంకు రూ. 250, ఆశాకు రూ. 250 చొప్పున పంపిణీ చేయనున్నారు. ఈ ఇన్సెంటివ్​లను నేషనల్​ హెల్త్​ మిషన్​నిధుల నుంచి ఇవ్వనున్నారు. అయితే కనీసం ప్రతి నెల టీచింగ్ ​ఆసుపత్రుల్లో 350, డిస్ట్రిక్ట్, ఎంసీహెచ్​ సెంటర్లకు 250, ఏరియా ఆసుపత్రుల్లో 150, సీహెచ్​ సీల్లో 50, 24 గంటల పీహెచ్​ సీల్లో 10, సాధారణ పీహెచ్​ సీల్లో 5 డెలివరీలు చొప్పున జరగాలని, అప్పుడే ఇన్సెంటివ్​లకు టీమ్​లను సెలెక్ట్​ చేస్తామని సర్కార్ ​జీవోలో పేర్కొన్నది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో నార్మల్​ డెలివరీలు పెరిగే అవకాశం ఉన్నదని ఆఫీసర్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed