అధికారుల ఆకస్మిక దాడి.. 12 మెడికల్ దుకాణాల లెసెన్స్ రద్దు

by Disha Web Desk 19 |
అధికారుల ఆకస్మిక దాడి.. 12 మెడికల్ దుకాణాల లెసెన్స్ రద్దు
X

దిశ, ప్రతినిధి మేడ్చల్: నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న మెడికల్ దుకాణాలపై మేడ్చల్ జిల్లా ఔషద నియంత్రణ అధికారులు కొరఢా ఝుళీపించారు. సోమవారం జిల్లాలోని పలు దుకాణాలపై ఆకస్మికంగా దాడులు నిర్వహించి, నిబంధనలు పాటించని 12 మెడికల్ దుకాణాల లైసెన్స్‌లను తాత్కలికంగా రద్దు చేశారు. ఈ మేరకు జిల్లా ఔషద నియంత్రణ శాఖ సహాయ సంచాలకుడు అనిల్ కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా జిల్లాలోని పలు దుకాణాల్లో దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇతర జిల్లాల అధికారులతో సంయుక్తంగా తనీఖీలు నిర్వహించగా, కొందరు మెడికల్ షాపు యాజమానులు ప్రి స్క్రిప్షన్ లేకుండా మందులు అమ్ముతున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. అదేవిధంగా రిజిష్టర్‌లు నమోదు చేయకపోవడం, ఫార్మసిస్టులు అందుబాటులో లేకపోవడం వంటి ఉల్లంఘనలు బయట పడినట్లు చెప్పారు. అలాగే కొందరు మెడికల్ షాపుల నిర్వహకులు ఇష్టానుసారంగా మత్తు మందులను విక్రయిస్తున్నట్లు తనిఖీలలో బయటపడ్డాయని వివరించారు. దీంతో ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పలు మెడికల్ షాపులకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసినట్లు వెల్లడించారు. 60 వరకు మెడికల్ షాపులపై చర్యలు తీసుకుంటున్నట్లు అనిల్ కుమార్ తెలిపారు. ఈ దాడులు నిరంతరం కొనసాగుతాయని అనిల్ కుమార్ హెచ్చరించారు. ఉల్లంఘలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Next Story

Most Viewed