రాష్ట్ర ప్రభుత్వం ఎంఎంటీఎస్​ వాటా రూ.631 కోట్లు ఇవ్వలే

by Disha Web Desk |
రాష్ట్ర ప్రభుత్వం ఎంఎంటీఎస్​ వాటా రూ.631 కోట్లు ఇవ్వలే
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ఎంఎంటీఎస్​వాటా చెల్లించలేదని, దాదాపు రూ.631 కోట్లు పెండింగ్​పెట్టిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వ్యాఖ్యానించారు. శుక్రవారం నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన ఆయనకు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి ఆహ్వానం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్​మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వడంలేదని విమర్శించారు. కాజీపేటలో పిరియాడిక్​ఓవర్​హాల్​ఏర్పాటుకు సర్కార్​సమయానికి భూమి కేటాయించలేదని, ఇటీవలే అందజేసిందని ఆయన తెలిపారు. ఈపనులకు సంబంధించి త్వరలోనే టెండర్లను ఆహ్వానిస్తామని ఆయన వెల్లడించారు.

హైదరాబాద్ కు సమీపంలో మేధా సర్వీస్​సిస్టం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ముందుకు వచ్చిందని, కోచ్ నిర్మాణం కోసం ఆర్డర్ కూడా ఇచ్చినట్లు ఆయన చెప్పారు. యూపీఏ హయాంలో తెలంగాణను అభివృద్ధి చేపట్టకుండా నిర్లక్ష్యం వహించిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఏటా కేవలం రూ.886 కోట్లు మాత్రమే కేటాయింపులు చేసిందని తెలిపారు. 2014 నుంచి తెలంగాణకు నిధులు పెంచింది మోడీ ప్రభుత్వమేనని ఆయన పేర్కొన్నారు. 2022-23 బడ్జెట్​లతో రాష్ట్రానికి రూ.3,048 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. 2009-14 వరకు ఒక్క లైన్ కూడా డబ్లింగ్ కాలేదని, బీజేపీ హయాంలోనే జరిగాయన్నారు.

తెలంగాణలో ఎంఎంటీఎస్​విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా నిధులు మంజూరు చేయాలని ఆయన డిమాండ్​చేశారు. ఇదిలా ఉండగా భారత ఇంజనీర్లు రూపొందించిన కవచ్ టెక్నాలజీతో ఒకే ట్రాక్ పై రెండు రైళ్లు ఎదురెదురుగా వస్తే లోకోపైలెట్​బ్రేకులు వేయకుండానే రైలు వేగం తగ్గిపోయిందని, అది తాను స్వయంగా పరిశీలించినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా దాదాపు 2 వేల కిలోమీటర్ల మేర కవచ్ టెక్నాలజీ వాడుతున్నట్లు స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో విస్తృతంగా ఈ టెక్నాలజీ వినియోగిస్తామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్​తెలిపారు.

Next Story

Most Viewed