టెలిగ్రామ్‌లో.. 1000 మందికి ఒకేసారి వీడియోకాల్!

by  |
టెలిగ్రామ్‌లో.. 1000 మందికి ఒకేసారి వీడియోకాల్!
X

దిశ, ఫీచర్స్ : పాపులర్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ కొత్త అప్‌డేట్‌ విడుదల చేసింది. ఈ మేరకు అనేక కొత్త ఫీచర్స్ అందుబాటులోకి రాగా, ఇకపై 1000 మందితో ఒకేసారి గ్రూప్ వీడియో కాల్ చేసుకునే సదుపాయాన్ని యూజర్లకు కల్పించింది. అయితే 30 మందికి మాత్రమే ఈ కాల్స్‌లో మాట్లాడే అవకాశం ఉండగా, మిగిలినవారు పార్టిసిపేట్ చేయొచ్చు. అంతేకాదు న్యూ అప్‌డేట్‌లో వీడియో మెసేజ్‌లను మునుపటి కంటే అధిక నాణ్యతతో రికార్డ్ చేయొచ్చు. అదేవిధంగా సాధారణ వీడియోలను 0.5 లేదా 2x వేగంతో చూడగలుగుతారు. 1-ఆన్-1 కాల్స్‌తో సహా అన్ని వీడియో కాల్స్‌కు సౌండ్‌తో కూడిన స్క్రీన్ షేరింగ్ వంటి ఫీచర్స్‌ను కూడా ఈ అప్‌డేట్ అందించడం విశేషం.

టెలిగ్రామ్.. గ్రూప్ వీడియో కాల్స్ 2.0ను పరిచయం చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. అప్‌డేట్‌లో భాగంగా మీడియా ప్లేయర్ ప్లేబ్యాక్ వేగాన్ని పెంచింది. కాల్స్ వేగంగా ఫార్వార్డ్ చేయడానికి లేదా స్లో మోషన్‌లో వీడియోలను చూడటానికి దీన్ని ఉపయోగించవచ్చు. అంతేకాదు ఇప్పుడు 1-ఆన్-1 కాల్స్ చేసేటప్పుడు వినియోగదారులు తమ స్క్రీన్స్ షేర్ చేసుకునేందుకు కూడా ఈ ప్లాట్‌ఫామ్ అనుమతిస్తుంది. కాబట్టి మీరు ఏదైనా సినిమా చూస్తు్న్నప్పుడు ఆ స్క్రీన్‌ను మీ స్నేహితుడితో షేర్ చేసుకుంటే ఇద్దరూ సినిమా చూడవచ్చు.

ఇక చాట్ విషయానికొస్తే.. గతంలో డిజప్పయిర్ ఫీచర్ సాయంతో ఒక రోజు లేదా వారం వరకు సెట్ చేసుకునే అవకాశం ఉండగా, ప్రస్తుతం 1 నెల తర్వాత ఆటోమేటిక్‌గా డిజప్పయిర్ అయ్యే ఆప్షన్ ఎంచుకోవచ్చు. యాప్‌లోని మీడియా ఎడిటర్ ఇప్పుడు మీ ఫోటోలు, వీడియోలను.. డ్రాయింగ్స్, టెక్స్ట్, స్టిక్కర్స్‌తో ఇల్యుస్ట్రేట్, డెకొరేట్ చేయడానికి అనుమతిస్తుంది. ఆడియో సెండ్ చేసినంత ఈజీగా వీడియో మెసేజ్ సెండ్ చేసే ఫెసిలిటీ కల్పించింది. మీరు మీ చాట్ బాక్స్‌లోని రికార్డింగ్ బటన్‌ని నొక్కి మీ కాంటాక్ట్స్ కూడా పంపవచ్చు. ఇది వీడియో గ్యాలరీలో సేవ్ కాకపోవడం విశేషం.


Next Story

Most Viewed