అసెంబ్లీ బరిలో YS షర్మిల.. పోటీచేసే నియోజకవర్గం ఖరారు

by GSrikanth |
అసెంబ్లీ బరిలో YS షర్మిల.. పోటీచేసే నియోజకవర్గం ఖరారు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల్లో పోటీపై వైఎస్‌ షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి బరిలో దిగాలని నిర్ణయించుకున్నారు. గురువారం హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్‌లో పార్టీ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. ఈ ఎన్నికల్లో ఒంటరిగానే రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పోటీ చేయాలనీ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు.. ఈ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేయాలని భావిస్తున్న అభ్యర్థులు టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పాలేరుతో పాటు మరో సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తానని వెల్లడించారు. తల్లి విజయలక్ష్మి, బ్రదర్ అనిల్ పోటీ చేయాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు.. అవసరమైతే వాళ్లు ఇద్దరు కూడా ఎన్నికల బరిలో ఉంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాగా, తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ షర్మిల వ్యవహారం రోజు రోజుకూ హాట్ టాపిక్ అవుతున్నది. కాంగ్రెస్ పార్టీలో తన వైఎస్సార్ టీపీ పార్టీని విలీనం చేయాలని భావించిన షర్మిలకు కాంగ్రెస్ వైపు నుంచి ఆశించిన రీతిలో సమాధానం దక్కలేదు. దీంతో ఇక ఒంటరిగానే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆమె రెండు స్థానాల నుంచి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. పాలేరుతో పాటు మిర్యాలగూడ అసెంబ్లీ సెగ్మెంట్లలో‌నూ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో షర్మిల రాజకీయ భవిష్యత్‌పై రకరకాల ఊహాగనాలు వ్యక్తం అవుతున్న వేళ వైఎస్సార్ టీపీ చీఫ్ రెండు స్థానాల్లో పోటీకి సై అంటుండటం వ్యూహాత్మకమా లేక ఓటమి నుంచి తప్పించుకునే మార్గమా అనేది ఆసక్తిగా మారింది.

Next Story