తుమ్మల బలమైన నేత అయితే ఎందుకు ఓడిపోతారు?

by GSrikanth |
తుమ్మల బలమైన నేత అయితే ఎందుకు ఓడిపోతారు?
X

దిశ, వెబ్‌డెస్క్: పాలేరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన ఓ మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ.. ప్రజల్లో ఉండేది నేనే.. పాలేరులో గెలిచేది నేనే అని ధీమా వ్యక్తం చేశారు. నేను నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తిని అని నా లాంటి వాడిని ప్రజలే గెలిపించుకుంటారని అన్నారు. ఇక్కడి నుంచి ఎంతమంది పోటీ చేసినా నా గెలుపును ఆపలేరని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో ప్రత్యేక వ్యూహం అమలు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. అసలు తుమ్మల నాగేశ్వరరావు బలమైన లీడర్ అయితే ఎందుకు ఓడిపోతారని ఎద్దేవా చేశారు. గోదావరి జలాలకు, తుమ్మల రాజకీయానికి ఏం సంబంధం అని ప్రశ్నించారు. ఇన్నేళ్లు తుమ్మల చేసిందేమీ లేదని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed