రెండు చోట్లా రేవంత్ రెడ్డి ముందంజ

by Disha Web Desk 2 |
రెండు చోట్లా రేవంత్ రెడ్డి ముందంజ
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ స్టేట్ చీఫ్ రేవంత్‌రెడ్డి పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాల్లోనూ తొలి మూడు రౌండ్లలో ఆధిక్యంలో ఉన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో ప్రతీ రౌండ్‌లో ఆయనకే ఎక్కువ ఓట్లు పోల్ అయ్యాయి. పోస్టల్ బ్యాలట్‌లలోనూ అడ్వాన్సులోనే ఉన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డిలోనూ ఆయనను ఓడించాలన్న పట్టుదలతో బరిలోకి దిగిన రేవంత్‌రెడ్డి అక్కడ కూడా ఆధిక్యంలోనే ఉన్నారు. కొడంగల్‌లో తొలి మూడు రౌండ్లు పూర్తయ్యే సమయానికి 4,159 ఓట్లతో రేవంత్ ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపు కామారెడ్డిలోనూ ఫస్ట్ మూడు రౌండ్ల ఓట్ల లెక్కింపు తర్వాత 2,354 ఓట్లతో ముందంజలో ఉన్నారు.

Next Story