ఖానాపూర్ కాంగ్రెస్ టికెట్‌కు రేఖా నాయక్ దరఖాస్తు!

by GSrikanth |
ఖానాపూర్ కాంగ్రెస్ టికెట్‌కు రేఖా నాయక్ దరఖాస్తు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖానాయక్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్‌లో తనకు టికెట్ నిరాకరించడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఆమె ఇవాళ కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఖానాపూర్ అసెంబ్లీ టికెట్ కోసం రేఖా నాయక్ తన పీఏ ద్వారా అప్లికేషన్‌ను పంపించారు. గాంధీ భవన్‌లో రేఖానాయక్ పీఏ దరఖాస్తు పత్రాలను అందజేశారు. నిన్ననే కాంగ్రెస్‌లో చేరిన రేఖానాయక్ భర్త శ్యాంనాయక్ సైతం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. బీఆర్ఎస్‌లో ఉంటూనే రేఖానాయక్ కాంగ్రెస్ టికెట్ కోసం అప్లికేషన్ పెట్టుకోవడం సంచలనంగా మారింది.

Next Story