రాహుల్ గాంధీతో తుమ్మల భేటీ.. సుమారు అరగంట పాటు చర్చ

by Disha Web Desk 2 |
రాహుల్ గాంధీతో తుమ్మల భేటీ.. సుమారు అరగంట పాటు చర్చ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్‌లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇటీవలే బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. ఈ మేరకు ఢిల్లీ చేరుకున్న తుమ్మల శనివారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. పార్టీలో చేరిన తర్వాత తుమ్మల రాహుల్ గాంధీతో భేటీ కావడం ఇదే తొలిసారి. పార్టీలో చేరిక సమయంలో సమయం ఇవ్వలేకపోవడంతో అధిష్టానం తుమ్మలను ఢిల్లీకి పిలిచింది.

ఈ మేరకు రాహుల్ గాంధీతో సుమారు అరగంట పాటు భేటీ అయిన తుమ్మల.. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇరువురు నేతలు కీలక చర్చలు జరిపారు. ఖమ్మం జిల్లాలో పార్టీ పరిస్థితి, రాజకీయ వ్యూహాలతో పాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉన్న పొలిటికల్ ట్రెండ్స్ పై చర్చించినట్లు సమాచారం. కాగా ఇవాళ మధ్యాహ్నం 1:30 ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో తుమ్మల భేటీ కాబోతున్నారు.

Next Story

Most Viewed