మా పార్టీ సింబల్ ఏంటి?.. ఎలక్షన్‌ కమిషన్‌పై కేఏ పాల్ సీరయస్

by Disha Web Desk 2 |
మా పార్టీ సింబల్ ఏంటి?.. ఎలక్షన్‌ కమిషన్‌పై కేఏ పాల్ సీరయస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: అసలు కేసీఆర్ ఎలక్షన్ కమిషన్ నడిపిస్తున్నారా? ఎలక్షన్ కమిషన్ నడిపిస్తోందా? అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ ప్రశ్నించారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఒక్క ప్రజాశాంతి పార్టీకి తప్ప పోటీ చేయని వైఎస్ఆర్టీపీకి కూడా ఎలక్షన్ సింబల్ ఇచ్చారని మండిపడ్డారు. గతంలో మునుగోడులో చేసిందే కేసీఆర్ మళ్ళీ రిపీట్ చేస్తున్నారని విమర్శించారు. తమకు కేటాయించిన గుర్తులేంటో చెప్పడం లేదని అసహనం వ్యక్తం చేశారు. హెలికాప్టర్ సింబలా? లేక రింగా? చెప్పాలని డిమాండ్ చేశారు.

నామినేషన్లకు రేపే చివరి రోజు అని, మా అభ్యర్థులు నామినేషన్ వేసే సమయంలో అధికారులు ‘మీ సింబల్ ఏమిటని హెలికాప్టర్ లేక రింగ్’ అని అడుగుతున్నారని చెప్పారు. కేసీఆర్ బీజేపీతో కుమ్మక్కు అయ్యి తనకు తెలియకుండా సింబల్ రాకుండా చేస్తున్నారని ప్రశ్నించారు. అయిన అందరికీ అడిగిన సింబల్స్ ఇచ్చి తన ఒక్కరికే సింబల్ ఇవ్వకపోవడానికి కారణం ఏమిటని నిలదీశారు. తమకు తమ సింబల్ కావాలని, లేదా ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఆయన జాతీయ ఎలక్షన్ కమిషన్‌ను కలిశారు.Next Story

Most Viewed