బీఆర్ఎస్‌కు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామా

by Disha Web Desk 2 |
బీఆర్ఎస్‌కు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామా
X

దిశ బ్యూరో, మహబూబ్ నగర్: ఎన్నికల వేళ అధికార బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. పార్టీకి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పంపించారు. అంతకుముందు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. టికెట్‌పై రేవంత్ రెడ్డి స్పష్టమైన హామీ ఇవ్వడంతో పార్టీకి రాజీనామా చేశారు. ఇదిలావుంటే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నుండి పోటీచేయాలని కసిరెడ్డి నారాయణరెడ్డి భావిస్తున్నారు.


ఇందుకోసం బీఆర్ఎస్ పార్టీలో ప్రయత్నించి భంగపడ్డారు. కొన్ని స్థానాల్లో మినహా అన్నిచోట్లా సిట్టింగ్‌లనే మళ్లీ బరిలోకి దింపాలని బిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నిర్ణయించారు. దీంతో నారాయణరెడ్డికి కాకుండా తిరిగి సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌కే కల్వకుర్తి టికెట్ దక్కింది. దీంతో తీవ్ర అసంతృప్తికి గురయిన ఎమ్మెల్సీ బిఆర్ఎస్ పార్టీని వీడడానికి సిద్ధమయ్యారు. ఇవాళే కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. అంతేకాదు.. కసిరెడ్డితో పాటు జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ టి.బాలాజీ సింగ్ కూడా పార్టీకి రాజీనామా చేశారు.



Next Story

Most Viewed