- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
డబ్బు సంచులు, ప్రజాసేవకు మధ్య ఎన్నికలు.. ములుగులో ఎమ్మెల్యే సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. పార్టీలన్నీ ఎన్నికల కోసం సన్నద్దమవుతున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన పూర్తవ్వగా.. కాంగ్రెస్, బీజేపీలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టాయి. కాంగ్రెస్ ఇప్పటికే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించగా.. వాటిని పరిశీలించి ఫైనల్ చేసే ప్రక్రియను షురూ చేస్తోంది. బలమైన అభ్యర్థులను ఫైనల్ చేసేందుకు కసరత్తులు చేస్తోంది. ఈ నెలలో కాంగ్రెస్ తొలి విడత అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశముందని తెలుస్తోంది.
ఒకవైపు పార్టీలన్నీ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తుండగా.. పార్టీల నేతలు హాట్ కామెంట్స్‌తో వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ములుగు నియోజకవర్గంలోని రాజకీయ పరిణామాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ములుగు నియోజకవర్గంలో త్వరలో రానున్న ఎన్నికల్లో ప్రజాసేవకు, డబ్బు సంచులకు మధ్య పోటీ జరుగుతుందని వ్యాఖ్యానించారు. తనను ఓడించేందుకు బీఆర్ఎస్ ఎన్ని డబ్బులైనా ఖర్చు పెట్టడానికి సిద్దంగా ఉందని ఆరోపించారు.
తాను ప్రజాసేవ చేస్తుంటే బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని, అందుకే డబ్బులతో తనను ఓడించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సీతక్క విమర్శించారు. ప్రభుత్వం తనపై కక్ష సాధించాలని చూస్తుందని, డబ్బు సంచులతో ఎన్నికల్లో గెలవాలని చూస్తుందని అన్నారు. తమ పార్టీ కార్యకర్తలను మభ్యపెట్టాలని చూస్తున్నారని, అది ఎప్పటికి జరగదన్నారు.
కాగా ములుగు బీఆర్ఎస్ అభ్యర్థిగా మావోయిస్టు నేపథ్యం నుంచి వచ్చిన బడే నాగజ్యోతికి అవకాశం దక్కింది. ప్రస్తుతం ములుగు జిల్లా పరిషత్ చైర్ పర్సన్‌గా ఆమె వ్యవహరిస్తున్నారు. సీతక్కకు కూడా మావోయిస్టు పార్టీ నేపథ్యం ఉండటంతో.. ఆమెను ఓడించేందుకు పోటీగా బడే నాగజ్యోతిని బీఆర్ఎస్ బరిలోకి దించుతుంది. దీంతో బడే నాగజ్యోతి ఇప్పటికే నియోజకవర్గంలో తిరుగుతూ ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ములుగులో గెలిచి కేసీఆర్‌కు కానుకగా ఇస్తానంటూ ఇప్పటికే బడే నాగజ్యోతి ప్రకటించారు. ఈ క్రమంలో బడే నాగజ్యోతి వర్సెస్ సీతక్క మాటల వార్ ములుగు రాజకీయాలను వేడెక్కిస్తుంది.