ఆఖరి నిమిషంలో వచ్చినా క్షణం వేస్ట్ చెయ్యను: Komatireddy Venkat Reddy

by Disha Web Desk 2 |
ఆఖరి నిమిషంలో వచ్చినా క్షణం వేస్ట్ చెయ్యను: Komatireddy Venkat Reddy
X

దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్‌ను సీఎం చేయాలని కలలు కంటున్నాడని తెలంగాణ ఏర్పడింది కేసీఆర్ కుటుంబం కోసం కాదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన హాట్ కామెంట్స్ చేశారు. ప్రజల అభీష్టం మేరకే తాను తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరానన్నారు. పార్టీలో ఇంకాస్త ముందుగా చేరి ఉంటే కేసీఆర్‌కు మైండ్ బ్లాంక్ చేసే వాడినని, ఇప్పటికైనా 70 నుంచి 80 స్థానాల్లో పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆఖరి నిమిషంలో పార్టీలో చేరినా నిద్రాహారాలు మాని పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పని చేస్తామన్నారు. నెలరోజుల పాటు కాంగ్రెస్ కుటుంబం కలిసి పని చేస్తే రాష్ట్రానికి కేసీఆర్ పీడ వదులుతుందన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో తెలంగాణలో పార్టీ పుంజుకుంటోందన్నారు.


Next Story