32 మంది అభ్యర్థులు ఔట్.. బీఆర్ఎస్ ఫస్ట్ లిస్టులో భారీ మార్పులు!

by GSrikanth |
32 మంది అభ్యర్థులు ఔట్.. బీఆర్ఎస్ ఫస్ట్ లిస్టులో భారీ మార్పులు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన 115 మంది అభ్యర్థుల జాబితాలో 32 మంది గల్లంతు కానున్నారు. వాటికి ఇచ్చిన టికెట్ ఆఫర్ రివర్స్ కానున్నది. ఆ స్థానాల్లో మహిళా అభ్యర్థులు రానున్నారు. కొత్తగా వచ్చే ఆ 32 మంది ఎవరు?.. ఏ స్థానాల్లో ఆ మార్పులు జరగనున్నాయి?.. ఇప్పటికే లిస్టులో ఉన్నవారిలో ఎసరు పడేది ఎవరికి? మహిళా రిజర్వేషన్ బిల్లు నేపథ్యంలో బీఆర్ఎస్ ఫస్ట్ లిస్టులో భారీ స్థాయిలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇంకా పార్లమెంటులో ఆ బిల్లుపై స్పష్టత రానున్నప్పటికీ ముందస్తుగానే లిస్టును దగ్గర పెట్టుకుని మార్పులు చేర్పులపై కసరత్తు మొదలైంది. మరికొన్ని రోజుల్లో దీనిపై స్పష్టత రానున్నది. ఇప్పటికే బీ-ఫామ్ నాకు వస్తుందో.. రాదో.. అనే డైలమాలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థులకు కొత్త టెన్షన్ పట్టుకున్నది.

చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే బిల్లును ప్రవేశపెట్టడానికి కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలపడంతో ఈ సెషన్‌లోనే చర్చకు వస్తున్నది. కొత్త భవనంలో మధ్యాహ్నం నుంచి లాంఛనంగా ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో స్పష్టత రానున్నది. త్వరలో బీఆర్ఎస్‌ అభ్యర్థుల్లో కొద్దిమంది తప్పుకోవడం అనివార్యం కానున్నది. మహిళా బిల్లు ప్రకారం రాష్ట్రంలోని అసెంబ్లీ స్థానాల్లో కనీస స్థాయిలో 39 మంది మహిళలు ఉండాల్సి ఉంటుంది. కానీ బీఆర్ఎస్ జాబితాలో ఏడుగురే ఉన్నారు. అదనంగా మరో 32 మందికి స్థానం కల్పించాల్సి ఉంటుంది. మహిళా బిల్లుపై మరింత క్లారిటీ వచ్చిన తర్వాత ఏ సెగ్మెంట్‌లో మహిళకు టికెట్ ఇవ్వాలన్నదానిపై స్పష్టత రానున్నది.

అధికార పార్టీకి సెగ్మెంట్ టెన్షన్!

అన్ని రాజకీయ పార్టీలకూ ఇది అనివార్యం అయినప్పటికీ ప్రస్తుతానికి అధికారికంగా లిస్టును ప్రకటించింది బీఆర్ఎస్ కావడంతో ఆ జాబితాలో సవరణలు తప్పదు. పార్లమెంట్‌లో బిల్లు పాస్ అయిన తర్వాత కేంద్ర ఎన్నికల కమిషన్.. దీనిపై కసరత్తు చేసి మార్గదర్శకాలను రూపొందిస్తుంది. దీనికి కొంత సమయం పడుతుంది. అప్పటికప్పుడు అభ్యర్థుల వెతుకులాటకు ఇబ్బందులుంటాయి. కాబట్టి ప్రతీ సెగ్మెంట్‌లోనూ ప్రత్యామ్నాయంగా మహిళలను గుర్తించే ప్రక్రియ మొదలైంది. నిర్దిష్టంగా ఏ సెగ్మెంట్ మహిళలకు రిజర్వు అవుతున్నదో తేలితే వెంటనే అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తున్నది. అప్పటివరకూ ఫస్ట్ లిస్టులో ఉన్న అభ్యర్థుల్లో ఎవరికి బీ-ఫామ్ వస్తుందనే సస్పెన్స్ కొనసాగుతూనే ఉంటుంది.

అభ్యర్థులకు బీ-ఫామ్ సస్పెన్స్

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లు, అందులోని అంశాలు, అది ఆమోదం పొందిన తర్వాత ఎప్పటి నుంచి అమల్లోకి రానున్నది.. ఇలాంటి అనేక అంశాలపై క్లారిటీ రావాల్సి ఉన్నది. ఒకవేళ తక్షణం ఈ బిల్లు అమల్లోకి వస్తుందని కేంద్రం నుంచి స్పష్టత వస్తే మహిళలకు ఏయే సెగ్మెంట్లను ఏ పద్ధతిలో రిజర్వు చేయాలనేది ఖరారు కావడానికి కొంత సమయం పట్టే అవకాశముంటుంది. ఈ కారణంగా అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూలు ప్రకారం వస్తాయా లేక ఆలస్యమవుతుందా అనేది తేలనున్నది. బీఆర్ఎస్ ఫస్ట్ లిస్టులో అభ్యర్థులుగా ఉన్నవారందరికీ ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది. ప్రచారాన్ని కొనసాగించడమా.. ఇప్పటి నుంచే ఖర్చు పెట్టడం అవసరమా.. మహిళా బిల్లుతో సీటు నాకే వస్తుందా.. ఇలాంటి అనేక సందేహాలను అభ్యర్థులను టెన్షన్ పెడుతున్నాయి.

Read More..

తెలంగాణలో కాంగ్రెస్‌దే గెలుపు.. 70 సీట్లకుపైగా.. ఏపీ ముఖ్యనేత ఆసక్తికర కామెంట్స్



Next Story

Most Viewed