కాంగ్రెస్‌లో చేరిన మోత్కుపల్లి నర్సింహులు.. ఆహ్వానించిన ఖర్గే

by Disha Web Desk 2 |
కాంగ్రెస్‌లో చేరిన మోత్కుపల్లి నర్సింహులు.. ఆహ్వానించిన ఖర్గే
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లి ఖార్జున ఖర్గే సమక్షంలో హస్తం తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యేలు ఆకుల లలిత, ఏనుగు రవీందర్ రెడ్డి, శాసన మండలి మాజీ ఉపాధ్యక్షుడు నేతి విద్యాసాగర్, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్, కరీంనగర్ బీర్ఎస్ నేత సంతోష్ కుమార్‌లు కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యారు. వీరందరికీ ఖర్గే కండువా కప్పి ఆహ్వానించారు. నిన్న(గురువారం)రాత్రి మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలు ఉన్నారు.




Next Story