BJP MP సోయం బాపురావు వెనుక సీఎం కేసీఆర్!

by GSrikanth |   ( Updated:2023-07-27 12:58:24.0  )
BJP MP సోయం బాపురావు వెనుక సీఎం కేసీఆర్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: మణిపూర్ మాదిరిగానే తెలంగాణను కూడా రావణకాష్టం చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత రాములు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని బీజేపీ ఎంపీ సోయం బాబురావు అంటున్నారని, రెండు తెగల మధ్య చిచ్చు పెట్టేలా వ్యాఖ్యలు చేస్తున్న బీజేపీ ఎంపీ సోయం బాబురావు పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన ఓడిపోతాననే భయంతోనే సోయం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని సోయం వాఖ్యలు తన వ్యక్తి గతమా లేక పార్టీ విధానమా చెప్పాలన్నారు. సోయం బాపురావుపై త్వరలోనే రాష్ట్రపతి, లోక్ సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తానన్నారు. సోయం బాబురావువెను సీఎం కేసీఆర్ ఉన్నారని ఆయనే బాపూరావు చేత ఇలా అనిపిస్తన్నారని ధ్వజమెత్తారు.




Advertisement

Next Story

Most Viewed