కాంగ్రెస్‌ పెద్దలతో షర్మిల టచ్‌లో ఉంది: అద్దంకి దయాకర్

by Disha Web Desk 2 |
కాంగ్రెస్‌ పెద్దలతో షర్మిల టచ్‌లో ఉంది: అద్దంకి దయాకర్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మళ్లీ మారుతున్నా్యి. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల మరోసారి కాంగ్రెస్‌ పెద్దలతో టచ్‌లోకి వెళ్లిందని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. పార్టీతో చర్చలు జరుగుతున్నాయని సమాచారం ఉందని అనూహ్య వ్యాఖ్యలు చేశారు. షర్మిలతో పాటు మరికొన్ని పార్టీలు కూడా తమతో కలిసి పనిచేస్తాయని అన్నారు.

గురువారం రాత్రి ఓ మీడియా చానల్ ప్రతినిధితో అద్దంకి ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. షర్మిల అసలు బరిలో ఉంటారా? లేదా? అనే క్లారిటీ కూడా నేతలకు ఇవ్వడంలేదు. ఇప్పటికే అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. శుక్రవారం నుంచి నామినేషన్లు కూడా ప్రారంభం కానున్నాయి. అయినా ఇప్పటి వరకు ఆమె నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో పలువురు నేతలు గురువారం రాత్రి లోటస్ పాండ్‌లో ధర్నాకు దిగారు. అసలు పోటీ చేయాలా? వద్దా? అనే అంశంపై అయినా షర్మిల మౌనం వీడాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో మళ్లీ షర్మిల కాంగ్రెస్ నేతలతో టచ్‌లోకి వెళ్లిందనడంపై ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Next Story

Most Viewed