KCR:పటాన్ చెరుకు సీఎం వరాల జల్లు

by Disha Web Desk 4 |
KCR:పటాన్ చెరుకు సీఎం వరాల జల్లు
X

దిశ, వెబ్‌డెస్క్: పటాన్ చెరులో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. గతంలో తాను 3 రోజులు పాటు పటాన్ చెరులో పాదయాత్ర చేశానన్నారు. ఇప్పుడు మహిపాల్ రెడ్డి నాయకత్వంలో పటాన్ చెరు బాగుందన్నారు. పటాన్ చెరు వరకు మెట్రో విస్తరించాలని కోరుతున్నారన్నారు. గతంలో పటాన్ చెరులో పరిశ్రమలు కరెంట్ సెమ్మె చేశాయన్నారు. ఇప్పుడు 3 షిఫ్టులు పరిశ్రమలు పనిచేస్తున్నాయన్నారు. తలసరి ఆదాయంలో దేశంలో తెలంగాణ నెంబర్ రాష్ట్రంగా నిలిచిందన్నారు. పటాన్ చెరు నుంచి హయత్ నగర్ వరకు మెట్రో రావాలన్నారు.

మళ్లీ గెలిపిస్తే ఖచ్చితంగా మెట్రో వస్తుందన్నారు. 55 గ్రామ పంచాయతీలకు రూ.15లక్షలు నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. పటాన్ చెరులో ఐటీ పరిశ్రమలు వచ్చేలా చూడాలని కేటీఆర్ కు చెప్తానన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రాష్ట్ర నీటి సమస్యను పరిష్కరించామన్నారు. తెలంగాణలో భూముల విలువ పెరిగిందని చంద్రబాబు నాయుడు చెప్పారన్నారు. తెలంగాణలో ఎకరా అమ్మితే ఏపీలో పది ఎకరాలు కొనొచ్చని చంద్రబాబు ఇటీవల చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. పటాన్ చెరుకు పాలిటెక్నిక్ కాలేజ్ మంజూరు చేస్తున్నామన్నారు. మూడు మున్సిపాలటీలకు రూ.30 కోట్ల నిధులు ఇస్తామన్నారు.

Also Read..

అమర వీరుల స్మారకంలోనూ అవినీతే.. రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు

Next Story