వాళ్లను జైలుకు పంపి తీరుతాం.. అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
వాళ్లను జైలుకు పంపి తీరుతాం.. అమిత్ షా సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేసీఆర్ ప్రభుత్వం కోట్లాది రూపాయాల అవినీతికి పాల్పడిందని కేంద్ర మంత్రి అమిత్ షా ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అవినీతికి పాల్పడిన వారినందరిని జైలుకు సాగనంపుతామన్నారు. సోమవారం ఉప్పల్ నియోజకవర్గంలో నిర్వహించిన రోడ్ షోలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ప్రచార రథంపై నియోజకవర్గ వీధుల్లో ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా షా మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తే మహిళలకు ఉచితంగా నాలుగు గ్యాస్ సిలిండర్లను అందజేస్తామన్నారు.

అర్హత కలిగిన కుటుంబాలకు ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ఏడాదికి రూ.10 లక్షల వరకు ఉచిత ఆరోగ్య కవరేజీ కల్పిస్తామన్నారు. చిన్న, సన్నకారు రైతులు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసేందుకు రూ.2,500 ఇన్‌పుట్‌ అసిస్టెన్స్‌ అందిస్తామన్నారు. తెలంగాణలో డిసెంబర్ 3వ తేదీన కమలం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అంతా సిద్ధమేనా? 2024లో మరోసారి ప్రధానిని మోడీ ప్రధాని చేయడానికి సిద్ధమేనా ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రశ్నించారు. బీజేపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

Read More..

బీజేపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించిన ఎంఆర్‌పీఎస్ నాయకులు..

Next Story

Most Viewed