‘అలా మాట్లాడటానికి కేటీఆర్‌కు కొంచమైన సిగ్గుండాలి’

by Disha Web Desk 2 |
‘అలా మాట్లాడటానికి కేటీఆర్‌కు కొంచమైన సిగ్గుండాలి’
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజలను కలవకుండానే కేసీఆర్ ఎన్నో పనులు చేస్తున్నాడని అందువల్ల ప్రజా దర్భార్ నిర్వహించి ముఖ్యమంత్రిని సామాన్యుడు ఎందుకు కలవాలని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్.. మీ దొరల పోకడ ప్రకారం సీఎం సామాన్య ప్రజలకే కాదు ఐఏఎస్, ఐపీఎస్, ఎమ్మెల్యేలను కలవొద్దు, మంత్రులతో మీటింగ్‌లు పెట్టొద్దు. అభివృద్ది అంశాలపై సమీక్షలు చేయొద్దు.

ఇంత జరుగుతున్నా సామాన్యుడు మాత్రం కేసీఆర్‌ను కలవాల్సిన అవసరం లేదని సెటైర్ వేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, రైతులకు పంటల బీమాతో పాటు నష్టపరిహారం, ప్రభుత్వ బడులలో యూనివర్సిటీలలో చదివే పిల్లలకు నాణ్యమైన విద్య, ప్రభుత్వ ఆస్పత్రులలో నాణ్యమైన సూపర్ స్పెషలిటీ వైద్యం వీటిల్లో సామాన్య ప్రజలకు కష్టాలు లేవా అని ప్రశ్నించారు. ప్రజలను కలవకుండానే కేసీఆర్ ఎన్నో పనులు చేస్తున్నారని చెప్పడానికి సిగ్గుండాలని గాటు వ్యాఖ్యలు చేశారు.

Next Story

Most Viewed