- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
బీఆర్ఎస్‌కు మరో షాక్.. బీజేపీలోకి మాజీ మంత్రి కుమారుడు

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో వలసల పర్వం ఊపందుకుంది. ఒక పార్టీలో అసంతృప్తితో ఉన్న నేతలు వేరే పార్టీలోకి జంప్ అవుతున్నారు. వేరే పార్టీల నుంచి హామీలు లభిస్తే గోడ దూకేందుకు రెడీ అవుతున్నారు. అధికార బీఆర్ఎస్‌లో అసంతృప్తితో ఉన్న నేతలు, టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు వేరే పార్టీలవైపు చూస్తున్నారు. కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరేందుకు అడుగులు వేస్తున్నారు.
ఈ క్రమంలో బీఆర్ఎస్‌కు మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి చందూలాల్ కుమారుడు డాక్టర్ ఆజ్మీరా ప్రహ్లాద్ కాషాయ కండువా కప్పుకోనున్నారు. గత కొంతకాలంగా ఆయన బీఆర్ఎస్‌లో అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఇప్పుడు ఎన్నికల వేళ బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 12న ఆయన కమలం గూటికి చేరనున్నారు. ఆ రోజు ములుగులో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి,. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారు.
2018 ఎన్నికల్లో ములుగు నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేసి సీతక్కపై చందూలాల్ ఓటమి పాలయ్యారు. కానీ గత కొంతకాలంగా బీఆర్ఎస్‌లో ప్రహ్లాద్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. బడే నాగజ్యోతికి ములుగు టికెట్ కేటాయించడంతో ప్రహ్లాద్ మరింత అసంతృప్తికి గురయ్యాడు. దీంతో బీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరేందుకు సిద్దమయ్యారు.