వాళ్లకు బీఆర్ఎస్ కంటే ఎక్కువ సీట్లే ఇస్తాం.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు

by GSrikanth |
వాళ్లకు బీఆర్ఎస్ కంటే ఎక్కువ సీట్లే ఇస్తాం.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: అభ్యర్థుల ప్రకటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం గాంధీ భవన్‌లో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీసీలకు బీఆర్ఎస్‌లో ఇచ్చిన సీట్ల కంటే ఎక్కువే ఇస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. మైనంపల్లి హన్మంతరావు రేపు పార్టీలో చేరబోతున్నారని తెలిపారు. ఆయన కుటుంబానికి రెండు టికెట్లు ఖరారు చేశామని స్పష్టం చేశారు. విడతల వారీగా అభ్యర్థుల ప్రకటన ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.

స్క్రీనింగ్ కమిటీ నివేదికను సిద్ధం చేశామని తెలిపారు. కేటీఆర్‌కు ఏపీ వాళ్ల ఓట్లు కావాలి.. కానీ, వాళ్లను మాత్రం పక్క రాష్ట్రం వాళ్లు అంటారని మండిపడ్డారు. ఎవరు ఎక్కడైనా నిరసనలు తెలిపే హక్కు ఉంటుందని చెప్పారు. చంద్రబాబు కేవలం ఏపీకి చెందిన వ్యక్తి మాత్రమే కాదని.. దేశ రాజకీయాలకు చెందిన వ్యక్తి అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐటీ ఉద్యోగుల నిరసనలకు ఒప్పుకోను అనడానికి హైదరాబాద్ కేటీఆర్ జాగీరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story