తెలంగాణ పీపుల్స్ జేఏసీ కీలక పిలుపు

by GSrikanth |
తెలంగాణ పీపుల్స్ జేఏసీ కీలక పిలుపు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో నిరంకుశ పాలన సాగిస్తున్న బీఆర్ఎస్ ప్రభత్వాన్ని ఎండకడదామని రాష్ట్ర ప్రజలకు తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సహజ వనరులను కొల్లగొడుతూ, ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ, ప్రజా వ్యతిరేక పాలన సాగించిందని ఇవాళ టీపీజేఏసీ ఓ ప్రకటన విడుదల చేసింది. బీఆర్ఎస్ ఒక ఉద్యమ పార్టీగా తన స్వభావాన్ని పోగొట్టుకుని ఫక్తు రాజకీయ పార్టీగా మారిందని వెల్లడించింది. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తుంగలో తొక్కిందని విమర్శించింది. ప్రజలపై నిర్బంధాన్ని ప్రయోగించి, వారి ప్రజాస్వామిక హక్కలను హరించిందని పేర్కొంది. రాష్ట్ర సెక్రటేరియట్‌కు రాకుండా, ఇటీవలి వరకూ ప్రగతి భవన్ నుండే ముఖ్యమంత్రి కేసీఆర్ ఏక వ్యక్తి పాలన సాగించారని వెల్లడించింది.

దేశవ్యాప్తంగా కార్పొరేట్ అనుకూల విధానాలతో, ఫాసిస్టు స్వభావంతో విద్వేషాలను రెచ్చగొడుతున్న బీజేపీ పార్టీ విస్తరణను రాష్ట్రంలో అడ్డుకుందామని టీపీ జేఏసీ పిలుపునిచ్చింది. నిరంకుశ బీఆర్ఎస్ ప్రభుత్వానికి, బీజేపీ ఎప్పటికీ ప్రత్నామ్నాయం కాదని తెలిపింది. కుమ్మక్కకు రాజకీయాలను ప్రజలు అర్థం చేసుకుని ఈ రెండు పార్టీలకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రెండు పార్టీలను ఓడించగలిగిన అభ్యర్థులను ఎంచుకునే స్వేచ్ఛ ప్రజలకు ఉంది. మద్యం, డబ్బు లాంటి ప్రలోభాలకు గురి కాకుండా ప్రజల అత్యంత స్పృహతో ఓటు హక్కును వినియోగించుకుని ఈ ఎన్నికల్లో ఓట్లు వేయాలని తెలంగాణ పీపుల్ జాయింట్స్ యాక్షన్ కమిటీ పిలుపునిచ్చింది.

Advertisement

Next Story

Most Viewed