TS ఆర్టీసీ‌కి తెలంగాణ కాంగ్రెస్ స్పెషల్ రిక్వెస్ట్

by GSrikanth |
TS ఆర్టీసీ‌కి తెలంగాణ కాంగ్రెస్ స్పెషల్ రిక్వెస్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఈనెల 17న తుక్కుగూడలో నిర్వహించే సోనియా గాంధీ సభకు ఆర్టీసీ బస్సులను సమకూర్చాలని కాంగ్రెస్ పార్టీ ఆ సంస్థను కోరింది. ఈ మేరకు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ మల్లు రవి ఆర్టీసీ ఈడీకి ప్రత్యేక వినతి పత్రాన్ని అందజేశారు. అన్ని జిల్లాలకు అనుమతి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనల ప్రకారం రెంట్ చెల్లిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మల్లు రవి మట్లాడుతూ.. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కనీసం పది వేల మందికి తగ్గకుండా జన సమీకరణ చేస్తున్నామన్నారు. అందుకే ముందస్తుగానే ఆర్టీసీ బస్సులు కావాలని అడుగుతున్నామన్నారు. గతంలో ఖమ్మం సభలో ప్రభుత్వం బస్సులు ఇచ్చేందుకు ఇబ్బంది పెట్టిందన్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా హెచ్ ఆఫీస్‌లో రిక్వెస్ట్ లెటర్ పెట్టామన్నారు. ఈ సభను సక్సెస్ చేసి కాంగ్రెస్‌కు ఎన్నికల శంఖారావం ఊదుతామన్నారు.

Advertisement

Next Story