ముఖ్యమంత్రిని సోనియా గాంధీ నిర్ణయిస్తారు: కోమటిరెడ్డి

by Disha Web Desk 2 |
ముఖ్యమంత్రిని సోనియా గాంధీ నిర్ణయిస్తారు: కోమటిరెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: గెలుపు ఉత్సాహంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం 45 వేలకు పైగా మెజార్టీలో దూసుకుపోతున్న వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణను గెలిచి సోనియా గాంధీకి బర్త్ డే గిఫ్ట్ ఇస్తున్నామని అన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రేవంత్ కష్టపడి పనిచేశారని కొనియాడారు. రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిని సోనియా గాంధీ, ఖర్గే నిర్ణయిస్తున్నారని తెలిపారు. కాగా, తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీస్తోంది. దాదాపు 67 నియోజకవర్గాల్లో హస్తం పార్టీ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. ఇప్పటికే మూడు నియోజకవర్గా్ల్లో గెలిచి సత్తా చాటారు.

Next Story